బోధన్, వెలుగు : సాలూరా మండలంలోని సాలూరాక్యాంప్ గ్రామంలో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ విజయ్ భాస్కర్ రెడ్డి, ఉప సర్పంచ్ మహేశ్వర్ రెడ్డి, వార్డు సభ్యులు పి.శ్రీనివాస్, ఎన్. నాగేశ్వరరావు, జె.కిరణ్, వై. రమణమ్మ, బి. కళ్యాణి, నారాయణమ్మ, పి.రమేశ్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రావు ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్‌రెడ్డిని కలిశారు.
గ్రామాభివృద్ధికి సహాయసహకారాలు అందించాలని కోరారు. ఇందుకు ప్రభుత్వ సలహాదారుడు సానుకూలంగా స్పందించి, ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు అభినందనలు తెలిపారు.
