అండర్ -19 మహిళా క్రికెటర్ ఆత్మహత్య

అండర్ -19 మహిళా క్రికెటర్ ఆత్మహత్య

అండర్ -19 మహిళా క్రికెటర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన త్రిపురలో జరిగింది. త్రిపుర రాజధాని అగర్తలాకు 90 కిలోమీటర్ల దూరంలోని ఉద‌య‌పూర్ సమీపంలోని తెనాని గ్రామానికి చెందిన 16 ఏళ్ల అయంతీ రీయాంగ్ మంగళవారం రాత్రి తన ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. అయంతీ తన తల్లిదండ్రులకు నాలుగో సంతానం. ఆటల్లో చురుకుగా ఉండే అయంతీ త్రిపుర అండర్ 19 జట్టుకు ఏడాది క్రితం ఎంపికయింది. అంతేకాకుండా ఆమె స్టేట్ టీ 20 మ్యాచులు కూడా ఆడింది.

అయంతి మృతిప‌ట్ల ప‌లువురు క్రీడా ప్ర‌ముఖులు‌ సంతాపం వ్య‌క్తం చేశారు. త్రిపుర క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి తిమురా చందా మాట్లాడుతూ.. రాష్ట్రం ప్రతిభావంతురాలైన క్రీడాకారిణిని కోల్పోయింద‌న్నారు. లాక్డౌన్ వల్ల మూడు నెలల నుంచి ఎటువంటి  మ్యాచులు ఆడలేదని ఆయన తెలిపారు. అయితే క్రీడాకారులందరికీ ఆన్ లైన్ క్లాసులు నిర్వహించామని.. అయంతీ ఎప్పుడూ ఏ సమస్య గురించి తమ వద్ద ప్రస్తావించలేదని ఆయన తెలిపారు.

For More News..

ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలు

గాంధీభవన్ లో కరోనా కలకలం.. వారం రోజులుగా నాయకులంతా అక్కడే ప్రెస్ మీట్

సీఎం సెక్రటరీకి కరోనా పాజిటివ్