43.1 ఓవర్లకు పాకిస్థాన్ ఆలౌట్: టీమిండియా టార్గెట్ 173

43.1 ఓవర్లకు పాకిస్థాన్ ఆలౌట్: టీమిండియా టార్గెట్ 173

అండర్‌ –19 వరల్డ్‌‌కప్‌ సెమీస్‌లో టీమిండియా రెచ్చిపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ టీమ్‌ను 43.1 ఓవర్లకే ఆలౌట్ చేసింది. 172 పరుగులకే పాక్ బ్యాట్స్ మెన్‌ని చిత్తు చేశారు మన బౌలర్స్. టీమిండియా ముందు 173 పరుగుల విజయ లక్ష్యాన్ని ఉంచింది పాక్. మ్యాచ్ స్టార్టింగ్ నుంచే మన బౌలర్లు లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో పాక్ బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేశారు. మనోళ్ల ఫోర్స్ తట్టుకోలేకపోయిన పాకిస్థాన్ ఆటగాళ్లు కేవలం ముగ్గురు తప్ప మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు.

పాకిస్థాన్ ఓపెనర్‌ హైదర్‌ అలీ, కెప్టెన్‌ రోహైల్‌ నాజిర్‌ ఇద్దరూ హాఫ్ సెంచురీలతో రాణించి.. కనీసం జట్టు పరువు నిలుపుకోగలిగారు. ఈ ఇద్దరు తప్ప మిగతా వాళ్లంతా పేలవంగా ఆడారు. టీమిండియా బౌలర్లలో సుషాంత్‌ మిశ్రా 3 వికెట్లు తీయగా.. రవి బిష్ణోయ్‌, కార్తిక్ త్యాగి చెరో 2 వికెట్లు, అంకోల్కెర్‌, యశస్వి జైస్వాల్‌లు ఒక్కో వికెట్‌ తీశారు.

ఇప్పటికే నాలుగుసార్లు చాంపియన్‌‌గా నిలిచిన టీమిండియా.. సెమీస్‌ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో నెగ్గితే వరుసగా మూడుసార్లు ఫైనల్‌ ఆడిన టీమ్‌గా రికార్డులకెక్కుతారు మన అండర్ 19 టీమ్ బాయ్స్. రికార్డుల పరంగా చూసుకున్నా.. ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా సీనియర్‌ జట్టును పాక్‌ ఓడించిన దాఖలాలు లేవు. సేమ్‌ జూనియర్‌ స్థాయిలో కూడా అదే రికార్డు కొనసాగుతోంది. గతేడాది ఆసియాకప్‌ లో పాక్‌ పై గెలిచిన ఇండియా కుర్రాళ్లు విజేతలుగా నిలిచారు.