కోల్​కత్తాలో కుప్పకూలిన ఐదు అంతస్థుల భవనం..ఇద్దరు మహిళలు మృతి...

కోల్​కత్తాలో కుప్పకూలిన ఐదు అంతస్థుల భవనం..ఇద్దరు మహిళలు మృతి...

 పశ్చిమ బెంగాల్‌ (West Bengal) రాజధాని కోల్‌ కతా (Kolkata)లో నిర్మాణంలో (Building Collapse) ఉన్న ఓ ఐదంతస్తుల భవనం  కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఇప్పటివరకు 13 మందిని రక్షించారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.సరైన అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మిస్తున్నట్లు సమాచారం. కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ సంఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పరిశీలించారు.

కోల్‌ కతా (Kolkata)లో నిర్మాణంలో ఉన్న భవనం కూలి పక్కన ఉన్న గుడిసెలపై పడింది. భవనంలో ఎవరూ లేరని స్థానికులు తెలిపారు. గుడిసెలలో ఎవరు ఉన్న విషయం తెలియలేదు. శిథిలాల కింద పదుల సంఖ్యలో చిక్కుకొని ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శిథిలాలను తొలగిస్తున్నామని, అంబులెన్స్‌లు కూడా సిద్ధంగా ఉంచామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై బిజెపి నేత సువేందు అధికారు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టాలని ఎక్స్‌లో ఆయన ట్వీట్ చేశారు.