గొప్ప సంస్కృతి, హస్తకళలు ఒడిశా సొంతం

గొప్ప సంస్కృతి, హస్తకళలు ఒడిశా సొంతం
  •      గవర్నర్​ తమిళిసై 
  •     శిల్పారామంలో ఒడిశా ఉత్సవాలు 

మాదాపూర్​, వెలుగు : గొప్ప సంస్కృతి, హస్తకళలు ఒడిశా సొంతమని తెలంగాణ గవర్నర్​ తమిళి సై అన్నారు. మాదాపూర్​లోని శిల్పారామంలో స్వాభిమాని ఒడియా పరివార్  హైదరాబాద్ సంయుక్త  నిర్వహణలో ఒడిశాకు చెందిన చేనేత హస్తకళా, ఫుడ్, కల్చరల్ ఉత్సవంలో  శనివారం గవర్నర్​ ముఖ్య అతిథిగా పాలొని  మాట్లాడారు.

 దేశమొదటి పౌరురాలు రాష్ర్టపతి ద్రౌపది ముర్ము ఒడిశా నుంచి వచ్చారని పేర్కొన్నారు. ఆ రాష్ట్ర  నృత్యం ఎంతగానో ఆకట్టుకుంది. తెలంగాణలో నివసించే ఒడిశా వాసులు తెలుగు నేర్చుకోవాలని, ఇక్కడి సంప్రదాయాలను గౌరవించాలని సూచించారు. 

అనంతరం చేనేత హస్తకళ, ఫుడ్​ స్టాల్స్​ను సందర్శించారు. కార్యక్రమంలో బీజేపీ లీడర్​ మురళిధర్​రావు, ఒడియా పరివారీ ప్రెసిడెంట్​ సుస్మిత మిశ్ర, అర్చన మిశ్రా, డీకే మహంతి, ఒడిశాకు చెందిన పలువురు పాల్గొన్నారు.