చిన్న బిజినెస్​లకు ముద్రా లోన్లు

చిన్న బిజినెస్​లకు ముద్రా లోన్లు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు ఆర్థిక సహాయాన్ని అందించడం కోసం కేంద్ర ప్రభుత్వం 2015లో  ప్రధాన మంత్రి ముద్రా యోజన (పీఎంఎంవై)ను మొదలుపెట్టింది. ఈ స్కీమ్ ​ద్వారా చిన్న వ్యాపారాలు వాటి ఆర్థికపరమైన అవసరాల కోసం రూ. 10 లక్షల వరకు   లోన్​ను పొందవచ్చు.   ప్రభుత్వ డేటా ప్రకారం గత ఏడు సంవత్సరాలలో, పీఎంఎంవై కింద రూ. 18.60 లక్షల కోట్ల విలువైన లోన్లను ఇచ్చారు. ఇందుకోసం మొత్తం 34.42 కోట్లకు పైగా లోన్​ ఖాతాలు తెరిచారు. పీఎం ముద్రా యోజన, వాటిలో రకాలు, పొందడానికి అర్హత,  ఎలా దరఖాస్తు చేసుకోవాలి ?... తదితర వివరాలు తెలుసుకుందాం.
పీఎంవైవై కింద మూడు రకాల లోన్లు పొందవచ్చు. అవి కింది విధంగా ఉన్నాయి

1.    శిశు: రూ. 50వేల- వరకు లోన్లను ఇస్తారు.
2.    కిషోర్: రూ. 50వేల- నుంచి  5 లక్షల వరకు.  
3.    తరుణ్: రూ. 5 లక్షల నుంచి  రూ. 10 లక్షల వరకు లోన్లను మంజూరు చేస్తారు.
    తరుణ్ లోన్ కోసం లోన్ మొత్తంలో 0.50శాతం (వర్తించే పన్నుతో పాటు) ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.  శిశు,  కిషోర్ లోన్లకు  ప్రాసెసింగ్ ఫీజు ఉండదు.

పీఎంవైవై  లోన్లకు అర్హతలు

    తయారీ, ప్రాసెసింగ్, ట్రేడింగ్ లేదా సర్వీస్​ సెక్టార్​ వంటి వ్యవసాయేతర రంగం ఆదాయాన్ని పొందడం కోసం బిజినెస్​ ప్లాన్​ఉన్న వాళ్లు రూ. 10 లక్షల కంటే తక్కువ మొత్తం అవసరమైతే ఈ లోన్ల కోసం బ్యాంక్, ఎంఎఫ్​ఐ లేదా నాన్​–బ్యాంక్​ఫైనాన్స్​ కంపెనీ (ఎన్​బీఎఫ్​సీ)లను సంప్రదించవచ్చు. పీఎంఎంవై కింద ఇవి మైక్రో యూనిట్స్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ & రీఫైనాన్స్ ఏజెన్సీ లిమిటెడ్ (ముద్రా) లోన్లను ఇస్తాయి.
అవసరమైన డాక్యుమెంట్లు
1.    లోన్ దరఖాస్తుదారు సెల్ఫ్​ అటెస్ట్​​ చేసిన ప్రూఫ్​తోపాటు  2 పాస్‌‌‌‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌‌‌‌లతో కూడిన ముద్ర లోన్ అప్లికేషన్.
2.    ఇది వరకటి ఫైనాన్షియల్​ రిజల్ట్స్​, దరఖాస్తుదారుడి వివరాలు, బిజినెస్​ ప్రొఫైల్​కు సంబంధించిన సమాచారంతో కూడిన లోన్​ అప్లికేషన్​. 
3.     పెట్టబోయే బిజినెస్​ సంబంధించిన సరఫరాదారుల సమాచారంతోపాటు యంత్రాల రకాలు,  ఇతర వస్తువుల వివరాలు
4.     వ్యాపార యాజమాన్యం,  వ్యాపార చిరునామా ఐడెండిటీ ప్రూఫ్​లు
5.     బిజినెస్​ చేసేందుకు అవసరమైన  లైసెన్స్‌‌‌‌లు,  డాక్యుమెంట్ల కాపీలు.

పీఎంఎంవై కోసం ఎలా దరఖాస్తు చేయాలి?

ప్రముఖ బ్యాంకులు,  ఆర్థిక సంస్థల సహాయంతో పీఎంఎంవై కింద ముద్రా లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌లో ముద్రా లోన్ కోసం ఇలా దశలవారీగా దరఖాస్తు చేయాలి. 
1.    ముందుగా ముద్రా లోన్ పొందాలనుకుంటున్న బ్యాంక్ లేదా ఆర్థిక సంస్థను ఎంచుకోండి.
2.    మీ వ్యక్తిగత,  ఉద్యోగ వివరాలను అందిస్తూ బేసిక్​ ముద్రా లోన్ దరఖాస్తు ఫారమ్‌‌‌‌ను నింపండి.
3.    పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, అడ్రస్ ప్రూఫ్ వంటి మీ కేవైసీ డాక్యుమెంట్లను ఇతర అవసరమైన డాక్యుమెంట్లతో పాటు సమర్పించండి.
4.    మీకు ఇప్పటికే వ్యాపారం ఉంటే, మీరు మీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నట్టు రుజువులు తప్పనిసరిగా అందించాలి.