కరాచీలోనే దావూద్

కరాచీలోనే దావూద్

మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాక్ లోని కరాచీలో నివాసం ఉంటున్నాడని హసీనా పార్కర్ కుమారుడు అలీషా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate)కు వెల్లడించాడు. హసీనా పార్కర్ దావూద్ సోదరి కాబట్టే ఆమె గురించి ప్రపంచానికి తెలిసిందన్నారు దావూద్ తో తన కుటుంబానికి సంబంధం లేదని, అయితే.. పండుగల సమయంలో ఆయన భార్య.. తమ్ముళ్లు, చెల్లెళ్లతో సంప్రదిస్తుందని అలీషా తెలిపారు. దివంగత తల్లి హసినా పార్కర్ ఎలాంటి కార్యకలాపాలు చేస్తుందనే విషయాన్ని ఈడీకి వెల్లడించినట్లు సమాచారం. వాస్తవానికి తన తల్లి గృహిణి అని, జీవనోపాధి కోసం చిన్న చిన్న ఆర్థిక లావాదేవీలు చేసేదన్నారు.

ఆస్తుల నుంచి ఆమెకు అద్దెలు వచ్చేవని, అవసరమయ్యే వారికి రూ. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు అప్పుగా ఇచ్చేదని తెలిపారు. కొన్ని లాభాలు పొందిందని పేర్కొన్నారు. అంతేగాకుండా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టినట్లు.. ఆస్తికి సంబంధించిన వివాదాలను పరిష్కరించేదన్నారు. 1986లో భారతదేశాన్ని దావూద్ విడిచిపెట్టినట్లు చెప్పాడు. దావూద్ ని UN నియమించిన గ్లోబల్ టెర్రర్ ఫైనాన్సర్ గా పేర్కొంది. అక్రమంగా డబ్బులు సంపాదించి.. హవాలా మార్గాల ద్వారా లాండరింగ్ చేయడంలో సహకరించిన దావూద్ బంధువులపై ఈడీ (ED) విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో చోటా షకీల్ బావ సలీంను ఈడీ ప్రశ్నించింది. 

మరిన్ని వార్తల కోసం : -

రాబోయే రెండు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు


రెచ్చగొట్టే నినాదాలు చేసిన మైనర్ బాలుడు