మిషన్ భగీరథ ప్లాంట్ ను సందర్శించిన .. యూనిసెఫ్ బృందం

మిషన్ భగీరథ ప్లాంట్ ను సందర్శించిన .. యూనిసెఫ్ బృందం

గజ్వేల్, వెలుగు: గజ్వేల్​ మండలంలోని కొమటిబండ మిషన్​ భగీరథ ప్లాంట్​ను యునిసెఫ్​బృందం మంగళవారం పరిశీలించింది. నల్లా ద్వారా ఇంటింటికి తాగు నీటిని అందజేస్తున్న విధానాన్ని మిషన్ భగీరథ సూపరింటెండెంట్​  ఇంజినీర్ శ్రీనివాసాచారి,  ఏఈ టి.రాజయ్య తెలియజేశారు.

ALSO READ :బకాయిలు చెల్లించకపోతే సమ్మెకు దిగుతాం

భగీరథ ప్లాంట్ లక్ష్యం, రూపకల్పన, వాటి పనితిరు, నీటి సరఫరా, నీటి స్వచ్చత అమలు చేసే విధానం గురించి వివరించారు. ప్లాంట్​ను సందర్శించిన వారిలో టీమ్​ సభ్యులు రాధిక శ్రీవాస్తవ్, వెంకటేశ్​ ఆలాపర్తి, రాఘవ్ ఆరోరా ఉన్నారు. వారితో ఇంట్రా డీఈఈ సుమలత, గ్రిడ్​ డీఈఈ నాగార్జునలతో పాటు స్థానిక సిబ్బంది పాల్గొన్నారు.