
గద్వాల, వెలుగు: పొలం దగ్గర ఉన్న ట్రాక్టర్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టగా పూర్తిగా కాలిపోయింది. మల్దకల్ మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన రైతు ఆనంద్ మంగళవారం రాత్రి ట్రాక్టర్ ను తన పొలం దగ్గర ఉంచి వచ్చాడు. అర్ధరాత్రి ట్రాక్టర్కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో పూర్తిగా కాలిపోయింది. బుధవారం ఉదయం పొలానికి వెళ్లగా ట్రాక్టర్ కాలిపోయి ఉంది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.