ఎంఎస్ఎంఈలకు ఊరట

ఎంఎస్ఎంఈలకు ఊరట
  • వివాద్ సే విశ్వాస్ 1 అండ్ 2, క్రెడిట్ గ్యారంటీ స్కీంలు 
  • ఏప్రిల్ 1 నుంచి అమలు చేయనున్న కేంద్రం 

న్యూఢిల్లీ: మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ ప్రైజెస్ (ఎంఎస్ఎంఈ)లకు ఈ బడ్జెట్ లో ఊరట లభించింది. ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా సెటిల్ మెంట్ స్కీంలు, క్రెడిట్ గ్యారంటీ స్కీంను ఆర్థిక మంత్రి ప్రకటించారు. దేశంలో ఏర్పడిన వివాదాలను ఎంఎస్ఎంఈలు సెటిల్ చేసుకునేందుకు త్వరలోనే డ్రాఫ్ట్ స్కీంను కేంద్రం ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. 

వివాద్ సే విశ్వాస్ 1: కరోనా సమయంలో కాంట్రాక్టులను పూర్తి చేయడంలో ఫెయిల్ అయిన ఎంఎస్ఎంఈల నుంచి ప్రభుత్వ రంగ సంస్థలు జప్తు చేసుకున్న బిడ్ మొత్తంలో 95% డబ్బును తిరిగి ఇచ్చేందుకు ఈ స్కీంను ప్రతిపాదించారు. 

వివాద్ సే విశ్వాస్ 2:  కాంట్రాక్టులకు సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం ఈ సెటిల్మెంట్ స్కీంను ప్రతిపాదించారు. ప్రభుత్వం లేదా ప్రభుత్వ రంగ సంస్థల వివాదాలు కోర్టుల్లో పెండింగ్ లో ఉన్న సందర్భాల్లో స్వచ్ఛంద  పరిష్కారం కోసం ఈ స్కీం కింద తగిన నిబంధనలను ప్రవేశపెట్టనున్నారు. 

క్రెడిట్ గ్యారంటీ స్కీం: ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే ఈ స్కీం కోసం రూ. 9 వేల కోట్లను కార్పస్ ఫండ్ గా కేటాయించారు. దీనికి అదనంగా కొల్లాటరల్ ఫ్రీ గ్యారెంటెడ్ క్రెడిట్ కింద మరో రూ. 2 లక్షల కోట్లను అలకేట్ చేశారు. అలాగే కాస్ట్ ఆఫ్​క్రెడిట్ ను 1%కు తగ్గించారు.