Cancer Foods: ఈ 6 ఫుడ్స్ తింటే క్యాన్సర్ వస్తది.. తేల్చి చెప్పింది హార్వర్డ్ డాక్టర్లు

Cancer Foods: ఈ 6 ఫుడ్స్ తింటే క్యాన్సర్ వస్తది.. తేల్చి చెప్పింది హార్వర్డ్ డాక్టర్లు

Cancer Causing Foods: ప్రమాదకర వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. అయితే దీనికి ఎక్కువగా జెనిటికల్ కారణాలతో పాటు ప్రజలు తినే ఆహారం కూడా ముప్పు పెరగటానికి కీలక కారణాల్లో ఒకటని హార్వర్డ్ లో చదువుకున్న గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేతి వెల్లడించారు. అయితే ప్రజలు రోజువారీగా తినే 6 ఆహారాలు కేన్సర్ రావటానికి, శరీరంలో పెరగటానికి దోహదపడతాయని ఆయన వెల్లడించారు. వీటిని మానేయటం ప్రజలకు వారి దీర్ఘకాలిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని ఆయన వెల్లడించారు. 

చక్కెర పానీయాలు: నేటి కాలంలో ప్రజలు శీతలపానీయాలు, ఫ్లేవర్డ్ డ్రింక్స్, రంగురంగుల సోడాలు ఎక్కువగా తాగుతున్నారు. ఇవి వెంటనే ఉపశమనం, ఎనర్జీ అందిస్తున్నప్పటికీ వీటిలో అధిక స్థాయిలో ఉండే చక్కెర శరీరంలోని రక్తంలో షుగర్ లెవెల్స్ అమాంతం పెంచేస్తాయని  సేతి చెప్పారు. అలాగే ఇవి చాపకింద నీరులా దీర్ఘకాలికంగా ఉండే ఇన్ ఫ్లమేషన్లకు ఆహారంగా మారి కొన్నాళ్లకు కేన్సర్ పెరగటానికి దోహదపడతాయి. దీంతో బ్రెస్ట్ కేన్సర్, ప్యాంక్రియాటిక్ కేన్సర్, కోలన్ కేన్సర్ వంటివి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 

వేయించిన ఆహారాలు: ఈరోజుల్లో పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువగా ఇష్టపడేవి ఆయిల్ ఫ్రైస్. స్నాక్స్ నుంచి భోజనంలోని కూరల వరకు నూనెలో వేయించిన ఆహారాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా వాడిన నూనెను మళ్లీ వినియోగించి చేసే వంటకాల ద్వారా ఏర్పడే ఇన్‌ఫ్లమేషన్స్ కేన్సర్ రిస్క్ పెంచుతాయని డాక్టర్ వెల్లడించారు. అందుకే ప్రజలు డీప్ ఫ్రైలు, బయటి ఆహారాలకు దూరంగా ఉండటం మంచిదని ఆమె వెల్లడించారు. 

బాగా కాల్చిన మాంసం: ప్రజలు ఇటీవలి కాలంలో ఎక్కువగా తింటున్న స్మోకీ, గ్లిల్డ్స్ మాంసపు ఆహారాలతో కేన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని డాక్టర్ చెప్పారు. ప్రధానంగా మాంసాన్ని ఎక్కువగా కాల్చటం లేదా నల్లగా వచ్చే వరకు గ్లిల్ చేయటం ప్రమాకరమని చెప్పారు. ఈ ప్రక్రియ వల్ల ఆహారాల్లో హెటిరోసైక్లిక్ అమైన్స్, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్లు ఉత్పత్తి అవుతాయని, ఇవి శరీరంలోని డీఎన్ఏ కణాలను డ్యామేజ్ చేస్తాయని ఆమె చెప్పారు. ఇలా ఎక్కువ సార్లు జరగటం వల్ల క్యాన్సర్ సెల్స్ శరీరంలో పెరగటానికి కారణం అవుతుందని హెచ్చరించారు. 

మద్యం సేవించటం: కొన్నిసార్లు గుండె ఆరోగ్యం కోసం రోజుకు ఒక గ్లాస్ వైన్ తాగటం మంచిదని అంటుంటారు. అయితే మద్యం సేవించటం వల్ల శరీరంలో హార్మోన్ల పనితీరు దెబ్బతిని బ్రెస్ట్ కేన్సర్, లివర్ కేన్సర్ వంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుందని డాక్టర్ సేతి అన్నారు. ఇది శరీరం న్యూట్రిషన్లను గ్రహించటానికి అవరోధంగా మారుతుందని తద్వారా డీఎన్ఏ రిపేర్ ప్రక్రియ దెబ్బతిని కేన్సర్ డెవలప్ అయ్యే ప్రమాదాలు పెరుగుతాయని హెచ్చరించారు. 

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్: ప్రధానంగా ప్యాకేజ్డ్ స్నాక్స్, నూడిల్స్, రెడీటూ ఈట్ ఆహారాలు వినియోగం నేటి కాలంలో పెరిగింది. అయితే వీటిలో ఉండే రిఫైన్డ్ షుగర్స్, ఆర్టిఫీషియల్ ఫ్లేవర్లు, అధిక చెడు కొవ్వులు అనారోగ్యాలకు కారణంగా మారతాయని డాక్టర్ చెప్పారు. వీటిని తరచుగా లేదా ఎక్కువగా తీసుకోవటం వల్ల శరీరంలో కేన్సర్ పెరగటానికి కారణంగా మారతాయని వెల్లడించారు. 

అల్ట్రా ప్రాసెస్డ్ మాంసాహారాలు: చాలా మంది అల్ట్రా ప్రాసెస్ చేయబడిన మాంసాలను అధిక ప్రొటీన్ ఫుడ్ అని భావిస్తుంటారు. అలాగే వేగంగా సిద్ధం చేసుకోవటానికి వీలుండటంతో వీటి వినియోగం పెరుగుతోంది. కానీ ఈ ఆహారాలు కేన్సర్ కారణంగా మారినట్లు గుర్తించబడింది. ప్రధానంగా కొలరిక్టల్ కేన్సర్ వస్తుందని డాక్టర్ చెప్పారు. శరీరంలోని కణాల అమరికను ఇవి దెబ్బతీయటం ద్వారా కేన్సర్ కి కారణంగా మారతాయని తేలింది. 

ఇలాంటి కేన్సర్ ప్రమాదాలను నివారించటానికి ప్రజలు రోజూ బ్యాలెన్స్డ్ డైట్ పాటించటం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే కేన్సర్ రాకుండా ఉండటానికి మంచి ఆహారపు అలవాట్లతో పాటు వ్యాయామం కూడా అవసరం అని వారు చెబుతున్నారు.