దేశ ప్రయోజనాలు కాపాడుతాం : పీయూశ్ గోయల్

దేశ ప్రయోజనాలు కాపాడుతాం : పీయూశ్ గోయల్
  • టారిఫ్ ప్రభావంపై స్టడీ చేస్తున్నాం
  • ప్రత్యామ్నాయ మార్కెట్​లను అన్వేషిస్తాం
  • పరిశ్రమలకు నష్టం జరగనివ్వమని వెల్లడి

న్యూఢిల్లీ:  ట్రంప్ విధించిన టారిఫ్ తో.. ఇండియాపై ఎంత మేర ప్రభావం ఉంటుందనే అంశంపై అధ్యయనం చేస్తున్నామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూశ్ గోయల్ అన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. పదేండ్లలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా ఇండియా పయనిస్తున్నదని అన్నారు. ట్రంప్ వేసిన 25 శాతం టారిఫ్​పై ఉభయ సభల్లో గోయల్ ప్రకటన చేశారు. “ఏ రంగాలు ప్రభావితం అవుతున్నాయో  తెలుసుకుంటాం. కార్యాచరణ రూపొందిస్తాం. పరిశ్రమలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం. 

ఇండియా, అమెరికా మధ్య పరస్పర ప్రయోజనకరమైన ‘ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం’ కోసం మార్చిలోనే చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకు 4 దశల్లో చర్చలు చర్చలు జరిగాయి. అక్టోబర్- లేదంటే నవంబర్ నాటికి ఒప్పందం మొదటి దశను పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రత్యామ్నాయ మార్కెట్‌‌‌‌లను అన్వేషిస్తాం’’అని గోయల్ అన్నారు. ఆగస్టు 25 నుంచి అమెరికా ప్రతినిధుల బృందం ఇండియాలో 6వ దశ వాణిజ్య చర్చల కోసం పర్యటించనున్నదని, ఈ చర్చల ద్వారా ట్రేడ్ డీల్‌‌‌‌ను ఖరారు చేసే అవకాశం ఉందన్నారు.