కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ 

కాసేపట్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్ 

కాసేపట్లో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఐదో సారి ఆర్ధిక మంత్రి హోదాలో  కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు రాష్ట్రపతిని ముర్మును నిర్మలా సీతారామన్ కలిశారు. బడ్జెట్ పై రాష్ట్రపతికి సమాచారం ఇచ్చారు. కాసేపట్లో నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు చేరుకుంటారు. మరోవైపు.. ఉదయం 10 గంటల30 నిమిషాలకు పార్లమెంటులో  మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఉదయం 11 గంటలకు లోక్ సభలో కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. 

బడ్జెట్ పై సామాన్య, మధ్యతరగతి గంపెడాశలు

కేంద్రం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ పై సామాన్య, మధ్యతరగతి పౌరులు గంపెడాశలు పెట్టుకున్నారు. అందరికీ ఊరటనిచ్చేలా బడ్జెట్ ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పొరుగు దేశాలైన  శ్రీలంక, పాకిస్థాన్‌లను చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు కూడా చెబుతున్నారు. ఈసారి మధ్యతరగతి వాళ్లు మాత్రం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచవ్యాప్త ఆర్థిక, సామాజిక పరిణామాల ప్రభావం భారత మధ్యతరగతివారిపైనా పడింది. 
 
తమకు ఊరటనిచ్చే ప్రకటనలేమైనా మోదీ ప్రభుత్వం చేస్తుందేమోనని ఆశిస్తున్నారు. ఆదాయపు పన్ను స్లాబుల్లో మార్పులను సామాన్యులు ఆశిస్తున్నారు. కనీస మినహాయింపు పరిమితిని రూ.5 లక్షలకు పెంచాలన్న డిమాండు గట్టిగా వినిపిస్తోంది. తయారీ, మౌలిక సదుపాయాల రంగాల్లో భారీగా ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యమిచ్చే అవకాశాలున్నాయి.