- ఫ్లాగ్ కోడ్ రిలీజ్ చేసిన హోం మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ: కాగితపు జాతీయ జెండాలను అగౌరవపర్చొద్దని, వేడుకలు ముగిసిన తర్వాత వాటిని గౌరవప్రదంగా డిస్పోజ్ చేయాలని కేంద్ర హోంశాఖ సూచించింది. త్వరలో జరగనున్న గణతంత్ర వేడుకల సందర్భంగా శుక్రవారం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సర్క్యులర్ జారీ చేసింది. జెండా దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతీక అని పేర్కొంది. జాతీయ, సాంస్కృతిక, క్రీడా కార్యక్రమాల్లో ప్రజలు ఉపయోగించిన కాగితపు జెండాలను గౌరవప్రదంగా డిస్పోజ్ చేయాలని సూచించింది.

