విభజన అంశాలపై 26, 27 తేదీలలో మీటింగ్

విభజన అంశాలపై 26, 27 తేదీలలో మీటింగ్

ఢిల్లీ: ఏపీ విభజన చట్టంలోని అంశాల పై కేంద్ర హోం శాఖ ఈనెల 26, 27 తేదీలలో సమావేశం నిర్వహించనుంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది. దీనికి హాజరుకావాలని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు పిలుపు అందింది. 

ఈనెల 3న జరిగిన దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ‘సదరన్ జోనల్ కౌన్సిల్’ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాలేదు. తన బదులు పలువురు రాష్ట్ర మంత్రి, సీఎస్, ఇతర ఉన్నతాధికారులను పంపారు. గతేడాది నవంబరు 14న  ఏపీలోని తిరుపతిలో జరిగిన ‘సదరన్ జోనల్ కౌన్సిల్’ మీటింగ్‌కు కూడా కేసీఆర్ అటెండ్ కాలేదు.  రాష్ట్ర సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు, విభజన చట్టంలోని హామీలపై  నిలదీయాల్సిన సీఎం.. మొత్తంగా సమావేశాలకే దూరంగా ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈనేపథ్యంలో మళ్లీ ఈనెల 26, 27 తేదీల్లో ఏపీ విభజన చట్టంలోని అంశాలపై కేంద్ర హోం శాఖ నిర్వహిస్తున్న సమావేశం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మాత్రం విభజన చట్టంలోని హామీల గురించి కేంద్రాన్ని ప్రతి సమావేశంలోనూ నిలదీస్తోంది. తెలంగాణ నుంచి రావాల్సిన బకాయిల గురించి,  తొమ్మిది, పదో షెడ్యూల్‌‌‌‌లో ఇంకా పూర్తి కాని సంస్థల విభజన అంశాల్ని లేవనెత్తుతోంది.