
ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న సాయిగణేష్ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉదయం సాయిగణేష్ అమ్మమ్మ సావిత్రి, చెల్లి కావేరితో ఫోన్లో మాట్లాడారు అమిత్ షా. ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. సాయి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆత్మహత్య ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని చెప్పారు అమిత్ షా. సాయిగణేష్ మృతిపై సీబీఐ విచారణ జరపించాలని కోరారు కుటుంబ సభ్యులు.