తెలంగాణలో టీఆర్ఎస్ నేలకూలుతోంది

తెలంగాణలో టీఆర్ఎస్ నేలకూలుతోంది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్. తెలంగాణ సీఎం కోపంగా, భయాందోళనలో ఉన్నారన్నారు. హుజూరాబాద్‌లో సర్జికల్ స్ట్రైక్  జరగడంతో కేసీఆర్ మాటలో వణుకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఒక్క ఎన్నికలో ఓడిపోతేనే పరిస్థితి ఇలా ఉంటే, తెలంగాణలో కేసీఆర్, టీఆర్‌ఎస్‌ల హయాం నేలకూలుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోందన్నారు అనురాగ్ ఠాకూర్. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మాటలు పాకిస్థాన్‌తో సమానంగా వినిపిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా కొత్త ప్రయోగాలు చేస్తుంటారు- హిజాబ్ అయినా, సర్జికల్ స్ట్రైక్ అయినా.. అభివృద్ధి విషయంలో బీజేపీతో పోటీ పడలేమన్నారు. సర్జికల్‌ స్ట్రైక్‌ను ప్రశ్నించడం కేసీఆర్‌ మనస్తత్వాన్ని తెలియజేస్తోందన్నారు అనురాగ్‌ ఠాకూర్‌. 

నిన్న కేసీఆర్ మాట్లాడుతూ సర్జికల్ స్ట్రైక్‌పై ప్రశ్నించారు. మోడీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్ చేసిందని చెబుతుందని.. వాటికి ఆధారం ఏంటని? ప్రశ్నించారు. ప్రజస్వామ్యదేశంలో మోడీ మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారన్నారు. రాహుల్ గాంధీ సర్జికల్ స్ట్రైక్‌పై ప్రశ్నిస్తే తప్పేంటన్నారు కేసీఆర్.

ఇవి కూడా చదవండి:

కేసీఆర్ రాజ్యాంగాన్ని అవమానించేలా  మాట్లాడారు