రైతులకు నష్టం కలిగించే ఒప్పందం చేసుకోం:మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

రైతులకు నష్టం కలిగించే ఒప్పందం చేసుకోం:మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
  • కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

భోపాల్: దేశంలోని రైతుల ప్రయోజనాలకే కేంద్రం ప్రాధాన్యం ఇస్తుందని, రైతులకు నష్టం కలిగించే ఒప్పందం ఏదీ కుదుర్చుకోబోదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. అమెరికాతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై ఒప్పందానికి సంబంధించిన వార్తల నేపథ్యంలో మంత్రి స్పష్టత ఇచ్చారు. శనివారం భోపాల్​లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

 " రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టే ఎలాంటి ఒప్పందం జరగదని ప్రధాని మోదీ తేల్చి చెప్పారు" అని ఆయన పేర్కొన్నారు. అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను కొంత తగ్గించి భారత్- అమెరికా సంబంధాలను బలోపేతం చేసే అవకాశం ఉందా అనే ప్రశ్నకు ఆయన ఈ జవాబిచ్చారు. 

రష్యా నుంచి చమురు దిగుమతి  చేస్తున్నం దుకు గాను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ఉత్పత్తులపై సుంకాల ను రెట్టింపు చేసి 50 శాతానికి పెంచిన విషయం తెలిసిందే.