సర్జికల్ స్ట్రైక్స్‌ గురించి ప్రపంచానికి తెలుసు

సర్జికల్ స్ట్రైక్స్‌ గురించి ప్రపంచానికి తెలుసు

తెలంగాణ సీఎం కేసీఆర్ సర్జికల్ స్ట్రైక్స్‌పై చేసిన వ్యాఖ్యలపై స్పందించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. సర్జికల్ స్ట్రైక్స్ గురించి ప్రపంచానికి తెలుసన్నారు. పాకిస్తాన్ ప్రధాని, పాక్ ఆర్మీ చీఫ్, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు ఈ విషయాన్ని అంగీకరించాయన్నారు. మన సైన్యాన్ని విశ్వసించాలన్నారు. దేశ సమగ్రతను కాపాడేందుకు మన జవాన్లు ఆత్మబలిదానాలు చేసుకున్నారన్నారు. ఆర్మీ విషయంలో రాజకీయాలు తీసుకురావద్దని తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పాటు అందరినీ కోరుతున్నానని తెలిపారు కిషన్ రెడ్డి. వారిని అవమానించకూడదన్నారు. వారి విశ్వాసాన్ని వమ్ము చేయకూడదని కిషన్ రెడ్డి తెలిపారు. 

 సీ కేసీఆర్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో సర్జికల్‌ స్ట్రైక్స్ పై ఫ్రూఫ్స్ కావాలని సీఎం కేసీఆర్ డిమాండ్​చేశారు.ఆదివారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో కేంద్ర ప్రభుత్వం, బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు కేసీఆర్. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పట్ల అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ స్పందించారు. రాహుల్​పై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని తాను వదిలిపెట్టనన్నారు. అస్సాం సీఎంపై బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ పై ఆధారాలు బయటపెట్టాలని రాహుల్ గాంధీ డిమాండ్​ చేయడంలో తప్పేంలేదన్నారు. సర్జికల్‌ స్ట్రైక్స్ పై నిజనిజాలు తెలవాలంటే ఆధారాలు బయటపెట్టాలన్నారు సీఎం కేసీఆర్. 

ఇవి కూడా చదవండి: 

దడ పుట్టిస్తున్న కరెంట్ బిల్లులు

మోడీ తలపాగాపై ప్రియాంక గాంధీ చురకలు