ప్రజలకు 5రూపాయలిచ్చి..కేజ్రీవాల్ రూ.95 దోచుకున్నారు:కేంద్రమంత్రి కిషన్రెడ్డి

ప్రజలకు 5రూపాయలిచ్చి..కేజ్రీవాల్ రూ.95 దోచుకున్నారు:కేంద్రమంత్రి కిషన్రెడ్డి

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అధికారం ఇచ్చేది సేవ చేయడానికి.. ప్రజలను మోసంచేయడానికి కాదు అని అన్నారు.ఇన్నాళ్లూ ఢిల్లీలో అవినీతి ప్రభుత్వం నడిపారు. కేజ్రీవాల్ ప్రభుత్వం 5 రూపాయలు ప్రజలకిస్తే.. 95 రూపాయలు తన జేబులో వేసుకుందని విమర్శిం చారు. 

27 ఏళ్ల తర్వాత ఢిల్లీ కాషాయం జెడా రెపరెపలాడింది. మోదీ సుపరి పాలనకు ప్రజల ఆశీస్సులు ఉన్నాయన్నారు కిషన్ రెడ్డి.. అందుకే ఢిల్లీలో మోదీ నాయకత్వానికి ప్రజలు పట్టం కట్టారని అన్నారు. 12ఏళ్లుగా ఢిల్లీకి పట్టిన శని గ్రహం ఇవాళ్టితో వీడిపోయిందన్నారు. ఇన్నాళ్లుగా ఢిల్లీలో అవినీతితో అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ఇక నుంచి ఢిల్లీలో అభివృద్ది పరుగులు పెడుతుందన్నారు. 

అహంకారంతో విర్రవీగే ఎవరైనా ప్రజాక్షేత్రంలో కనుమరుగు కావాల్సిందే.. ప్రజలు డిసైడ్ అయితే రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, కేసీఆర్ లు ఎవరైనా సరే కొట్టుకు పోవాల్సిందే అన్నారు కిషన్ రెడ్డి. 

కేజ్రీవాల్ పై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అన్న హజారే ఉద్యమంలో కేజ్రీవాల్ ఓ కలుపు మొక్క అని విమర్శించారు. ఢిల్లీ ఎన్నికల ఫలి తాల తర్వాత అన్న హజారే ఇచ్చిన స్టేట్ మెంట్కు మద్దతు తెలుపుతున్నామన్నారు కిషన్ రెడ్డి. 

ALSO READ | ఢిల్లీలో బీజేపీ ఎలా గెలిచింది.. ఆప్ను ఎలా మట్టికరిపించింది..?

కాంగ్రెస్ పార్టీ దీన స్థితి చూస్తే ఇవాళ జాలి కలుగుతోందన్నారు. రాహుల్ గాంధీపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులకే నమ్మకం లేదన్నారు కిషన్ రెడ్డి. గత 15ఏళ్లుగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సాధించింది ఏమీ లేదన్నారు. ఒక్కసారి డక్కౌట్, రెండోసారి డబుల్ డెక్ గా, మూడోసారి గోల్డెన్ దక్కౌట్ గా మిగిలిపోయారని విమర్శించారు.  

నీతివంతమైన పాలన అందించడంలో కాంగ్రెస్, ఆప్ పార్టీలు విఫలం అయ్యాయన్నారు కిషన్ రెడ్డి. లిక్కర్ స్కాం జరిగిందని ఢిల్లీ ప్రజలు రుజువు చేశారు..  లిక్కర్ స్కాంలో వాస్తవాలను గ్రహించి కోర్టు తీర్పు ఇస్తుందని దేశ ప్రజలు నమ్మకంతో ఎదురు చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఎన్నో హామిలిచ్చిన మోడీ గ్యారంటిలనే ఢిల్లీ ప్రజలు నమ్మారు.  మోడీ పాలనకు పట్టం కట్టారని అన్నారు. 

కేజ్రీవాల్ దేశంలో అతి పెద్ద అవినీతి పరుడని అన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.  కేజ్రీవాల్ డ్రామాలను డిల్లీ ప్రజల అర్థం చేసుకున్నారని చెప్పారు.  ఈ జన్మలో మోడీ ఆప్ పార్టీని ఓడించలేరు అంటూ అరవింద్ కేజ్రీవాల్ సవాల్ చేశారు.  కేజ్రీవాల్ అహంకారపు సవాళ్లకు డిల్లీ ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. 

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై మాజీమంత్రి, బీఆర్ ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు.  ఢిల్లీలో బీజేపీ గెలుపుకు కాంగ్రెస్ సహక రించిందని అన్న కేటీఆర్ వ్యాఖ్యలకు.. తెలంగాణలో కాంగ్రెస్ ఎలా అధికారంలోకి వచ్చిందో సమాధానం చెప్పాలన్నారు కిషన్ రెడ్డి.  బీజేపీ అధికారంలోకి రావడానికి రాహుల్ గాంధీ కారణమా లేదా అనేది మేం చెబుతామని అన్నారు.