
ముషీరాబాద్/పద్మారావునగర్, వెలుగు: గారడీలతో రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసేవరకు వదిలిపెట్టబోమని హెచ్చరించారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ‘కానరాని మహిళా గ్యారంటీలు– కదం తొక్కిన మహిళలు’ పేరుతో ధర్నా చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. డిసెంబర్ 9 తర్వాత సోనియమ్మ రాజ్యం వస్తుంది.. రైతుల అప్పులను ప్రభుత్వమే కడుతుంది.. కొత్తగా అప్పులు తీసుకోండి.. అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రైతు రుణమాఫీ చేయలేకపోయాడని విమర్శించారు.
ఎన్నికల టైంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలు ఎక్కడ అని ప్రశ్నించారు. రెగ్యులర్ బస్సులను సగానికి పైగా తగ్గించి, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటూ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్కూడా ఇలాగే కొత్త రేషన్‌కార్డులు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, రైతులకు ఎకరానికి రూ.15,000 పెట్టుబడి సాయం ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, మేకల శిల్పారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బాక్సింగ్ చాంపియన్ కు సత్కారం
ఇటీవల హర్యానాలో జరిగిన నేషనల్ బాక్సింగ్చాంపియన్షిప్(అండర్–18)లో విజేతగా నిలిచిన బన్సీలాల్‌పేట యువశక్తి ఆటో డ్రైవర్స్వెల్ఫేర్అసోసియేషన్సభ్యుడు, ఆటో డ్రైవర్ విజయ్కుమార్కొడుకు ఆంటోని బాస్ ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మంగళవారం సత్కరించారు. ఆటోడ్రైవర్ కొడుకు చాంపియన్‌గా నిలవడం గొప్ప విషయమన్నారు.