మౌనిక మృతి బాధాకరం..జీహెచ్ఎంసీ సిబ్బంది లోపమే కారణం

మౌనిక మృతి బాధాకరం..జీహెచ్ఎంసీ సిబ్బంది లోపమే కారణం

సికింద్రాబాద్ కళాసిగూడ నాలాలో పడి మౌనిక అనే బాలిక పడి మృతి చెందడం బాధాకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టర్లకు జీహెచ్ఎంసీ బకాయిలు చెల్లించకపోవడంతో నాలాల నిర్వహణ సరిగా లేకనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. భారీ వర్షం వస్తుందని వాతావరణ శాఖ హెచ్చరించినా..జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్గా లేరని మండిపడ్డారు. నాలాల నిర్వహణలో జీహెచ్ఎంసీ సిబ్బంది లోపం కారణంగానే ఈ ఘటన జరిగిందన్నారు. మౌనిక కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం, జీహెచ్ఎంసీ ఆదుకోవాలని కోరారు. 

అంతకుముందు మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బీహార్ వాజ్ పేయి ఫౌండేషన్ ద్వారా మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో స్కిల్ డెవలప్మెంట్లో శిక్షణ పొందిన మహిళలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు. ఆ తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో భారత్ గౌరవ్ యాత్ర ట్రైన్ను  ప్రారంభించారు.