నేషన్​ ఫస్ట్​ అనే స్ఫూర్తితో డాక్టర్లు పని చేయాలి: కేంద్ర మంత్రి మాండవీయ

నేషన్​ ఫస్ట్​ అనే స్ఫూర్తితో డాక్టర్లు పని చేయాలి: కేంద్ర మంత్రి మాండవీయ

లక్నో :  డాక్టర్లు.. నేషన్ ఫస్ట్ (దేశం ముందు) అనే స్ఫూర్తితో పనిచేయాలని కేంద్ర మంత్రి మన్​సుఖ్ మాండవీయ సూచించారు. 2047 నాటికి భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలన్న ప్రధాని మోదీ కలలను నిజం చేసే దిశగా పనిచేయాలని కోరారు. శనివారం లక్నోలోని సంజయ్ గాంధీ ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 28వ కాన్వొకేషన్​లో మాండవీయ పాల్గొని మాట్లాడారు. ఆరోగ్యకరమైన సమాజం.. ఆరోగ్యకరమైన దేశాన్ని సృష్టించగలదని, ఆరోగ్యకరమైన దేశం మాత్రమే సంపన్న దేశాన్ని సృష్టిస్తుందని ఆయన చెప్పారు. డాక్టర్లు రోగికి ట్రీట్​మెంట్​ చేయడమే కాకుండా వారికి సేవ కూడా చేయాలని ఆయన సూచించారు. డాక్టర్​కు.. పేదవాడి ప్రాణం ఎంత ముఖ్యమో.. ధనవంతుడి ప్రాణం కూడా అంతే ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు.