అధికారికి నీళ్లిచ్చిన కేంద్ర మంత్రి

అధికారికి నీళ్లిచ్చిన కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: స్పీచ్ మధ్యలో ఓ అధికారికి దాహం వేయగా... స్వయంగా కేంద్ర మంత్రే నీళ్లు అందించిన ఘటన దేశ రాజధానిలో జరిగింది. ఇక నీళ్లు అందించింది ఎవరో కాదు ... కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక వివరాల్లోకి వెళ్తే... నేషనల్ సెక్యూరిటీస్ డిపాసిటరీ లిమిటెడ్(ఎన్ఎస్డీఎల్) 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంస్థ ఆధ్వర్యంలో సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా సంస్థ ఎండీ పద్మజా చుండూరు తన ఉపన్యాసాన్న ప్రారంభించారు. అయితే ఉపన్యాసం మొదలైన కొద్ది సేపటికే పద్మజాకు దాహం వేయగా... తాగడానికి నీళ్లు ఇవ్వాలని కోరుతూ సిబ్బందికి సైగ చేశారు. సిబ్బంది ఎవరూ రాకపోవడంతో... కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తానే స్వయంగా ఓ వాటర్ బాటిల్ తీసుకెళ్లి పద్మజాకు ఇచ్చింది. దీంతో ఆశ్చర్యానికి గురైన పద్మజా... మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది. ఇక అక్కడున్న వారంతా నిర్మలా సీతారామన్ చేసిన పనికి అభినందనలు తెలుపుతూ చప్పట్లు కొట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేద్ర ప్రధాన్ ట్విట్టర్ లో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఓ మంత్రిగా ఉండి తన శాఖలోనే పని చేసే అధికారికి నీళ్లు అందించిన నిర్మలా సీతా రామన్ సింప్లిసిటీని ప్రతి ఒక్కరూ మెచ్చుకుంటున్నారు.

మరిన్ని వార్తల కోసం...

ఉపాధి పనులకు బొట్టుపెట్టి పిలుస్తున్నరు

భారీ నష్టాల్లో దేశీ సూచీలు