బైక్​ యాక్సిడెంట్లకు భారీ ఫైన్లు

బైక్​ యాక్సిడెంట్లకు భారీ ఫైన్లు
  •     మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, గాయపడితే రూ.2.5 లక్షల పరిహారం
  •     బండి ఓనరే డబ్బులు చెల్లించాలి: కేంద్రం ప్రపోజల్​

న్యూఢిల్లీ: మోటార్​ వెహికిల్స్​ యాక్టుకు మరింత పదునుపెట్టే సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్​సభ ముందుకు తెచ్చింది. దీని ద్వారా రూల్స్ పాటించనివాళ్లకు భారీ ఫైన్లు విధించడంతోపాటు ప్రమాద సమయాల్లో సాయం చేసే వారికి రక్షణ కల్పించడానికి వీలవుతుంది. వీటితోపాటు యాక్సిడెంట్​లో చనిపోయిన మృతుడి కుటుంబానికి రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.2.5లక్షల పరిహారాన్ని  బైకు యజమానిగానీ, బీమా ద్వారాగానీ చెల్లించాల్సిఉంటుందని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎంపీల అభ్యంతరాలకు సమాధానమిచ్చిన కేంద్ర ట్రాన్స్​పోర్ట్​ మినిస్టర్​ నితిన్​ గడ్కరీ.. రాష్ట్రాల హక్కుల్ని లాక్కునే ఉద్దేశం కేంద్రానికి లేదని, యాక్సిడెంట్ల బారిన పడకుండా ఎక్కువ మంది ప్రాణాలు కాపాడటమే బిల్లు ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ట్రాన్స్​పోర్ట్​ లైసెన్స్​ కాలపరిమితిని మూడేండ్ల నుంచి ఐదేండ్లకు పెంచే ప్రతిపాదన బిల్లులో ఉందన్నారు.

కమర్షియల్​ సరోగసీ రద్దు బిల్లు

దేశంలో కమర్షిల్​ సరోగసీ విధానాన్ని నిషేధించేందుకు వీలుగా సరోగసీ (నియంత్రణ) బిల్లును-2019ని రూపొందించిన కేంద్రం దాన్ని సోమవారం లోక్​సభలో ప్రవేశపెట్టింది.