అవగాహనతోనే సైబర్ నేరాల నివారణ : కేంద్ర సహాయ మంత్రి సంజయ్కుమార్

అవగాహనతోనే సైబర్ నేరాల నివారణ  : కేంద్ర సహాయ మంత్రి సంజయ్కుమార్

రామడుగు, వెలుగు: సైబర్ నేరాల నివారణకు అవగాహన అవసరమని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్​కుమార్​ అభిప్రాయపడ్డారు. సైబర్ సత్యాగ్రహ తెలుగు రాష్ట్రాల కన్వీనర్, యువజన అవార్డు గ్రహీత గజ్జెల అశోక్ రూపొందించిన ‘సరైన అవగాహనే సైబర్ క్రైమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నివారణ’ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా బండి సంజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ డిజిటల్ యుగంలో చిన్న పొరపాటే పెద్ద నష్టానికి దారితీసే ప్రమాదముందని, ప్రజల్లో సైబర్ భద్రతపై  అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి వేముండ్ల కుమార్, లీడర్లు జేరిపోతుల పోచయ్య, నర్సయ్య, మహేష్, నవీన్​కుమార్, అజయ్ వెంకటేశ్, సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, చందు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు  పాల్గొన్నారు.