దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు?

దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు?

తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలుపై మరోసారి స్పష్టత ఇచ్చారు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్. యాసంగి సీజన్ లోనూ కచ్చితంగా తెలంగాణ నుంచి రా రైస్ కొంటామని ప్రకటించారు. రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యతని పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆధ్వర్యంలో ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు పార్లమెంట్ లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు. కేంద్రం యాసంగి ధాన్యం కొనకుండా తెలంగాణకు అన్యాయం చేస్తోందంటూ TRS ప్రభుత్వం కేంద్రాన్ని బద్నాం చేస్తుందని వివరించారు. ఈ సందర్భంగా పీయూష్ గోయల్ స్పందిస్తూ.. అసలు రా రైస్ కొనబోమని చెప్పిందెవరు..?  దేశవ్యాప్తంగా బియ్యం ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఆపుతామో చెప్పాలన్నారు. పక్కా రా రైస్ కొంటామని.. రైతులకు ఇబ్బంది కాకుండా చూడటం తమ కనీస బాధ్యత అని చెప్పారు పీయూష్ గోయల్. అసలు గతంలో ఇస్తానన్న బియ్యన్నే తెలంగాణ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వనేలేదన్నారు. దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తుందో టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పాలన్నారు. పార్లమెంట్ సాక్షిగా గతంలోనే TRS లేవనెత్తిన అంశాలన్నింటికీ సమాధానమిచ్చామన్నారు. తెలంగాణ నుంచి బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతకం చేసింది కదా.. ఇప్పుడొచ్చిన ఇబ్బందేంటో  స్పష్టం చేయాలన్నారు పీయూష్ గోయల్.

 

ఉప ఎన్నికలో పోటీకి దిగిన బాలీవుడ్ నటుడు