Farmers Protest: రైతులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం

Farmers Protest: రైతులపై మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం
  • రైతులతో కేంద్రమంత్రుల మూడో దఫా చర్చలు 
  • గ్యారెంటీ MSP ప్రకటించడం సాధ్యం కాదన్న కేంద్ర మంత్రులు
  • అన్ని డిమాండ్లు నెరవేర్చాలని పట్టుబడుతున్న రైతులు 
  • శంభు సరిహద్దు వద్ద రైతులపై హర్యానా భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగం 

రైతుల ఆందోళనతో పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో రైతులు, భద్రతా దళాలకు మధ్య ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, రైతులతో చర్చలు జరిపేందుకు ముగ్గురు కేంద్ర మంత్రులతో ప్యానెల్ గురువారం (ఫిబ్రవరి 15) సాయంత్రం చంఢీగడ్లో రైతు నాయకులతో సమావేశమయ్యారు. సంయుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా రైతుసంఘం నాయకులతో మూడోసారి కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద్ రాయ్ చర్చల్లో పాల్గొ న్నారు. 

రైతులతో కేంద్ర మంత్రులు మూడోసారిచర్చలు జరుపుతున్నారు. ఫిబ్రవరి 8, 12 తేదీల్లో రెండుసార్లు రైతులు చర్చలు అసంపూర్తిగా జరిగాయి. పంటలకు కనీస మద్దతు ధర చట్టం, రుణమాఫీ సహా రైతుల డిమాండ్లను సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు నిరసన లు చేస్తున్నారు రైతులు. అయితే చర్చలో రైతుల డిమాండ్లకు కేంద్రం నో చెప్పినట్లు తెలుస్తోంది. గ్యారెంటీ MSP  ప్రకటించడం సాధ్యం కాదని కేంద్రం స్షష్టం చేసినట్లు తెలుస్తోంది. 

మరోవైపు ఢిల్లీ చలో మార్చ్ లో రెండో రోజైన గురువారం (ఫిబ్రవరి 15) వేలాది మంది నిరసన కారులు అక్కడే ఉండటంతో హర్యానా భద్రతా సిబ్బంది రెండు రాష్ట్రాల మధ్య శంభు సరిహద్దు వద్ద పంజాబ్ కు చెందిన రైతులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. 

ఇదిలా ఉంటే.. ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. ట్రాక్టర్, ట్రాలీలు, పెద్ద గుంపులను నిషేధించారు. రైతుల యాత్ర, కారణంగా అధికారులు విధించిన కట్టుదిట్టమైన భద్రతా చర్యలతో ఢిల్లీ, ఘజియాబాద్ సరిహద్దులో బుధవారం భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడిన విషయం తెలిసిందే. 

ఫిబ్రవరి 16న రైతులు, కార్మిక సంఘాలు ఉమ్మడిగా భారత్ బంద్ కు పిలుపునిచ్చాయి. వీరి సంఘీభావంగా మేధావులు, కళాకారులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.  రైతు నాయకులతో చర్చల్లో పాల్గొన్న కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి అర్జున్ ముండా సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని రైతులను కోరారు. కొత్త చట్టాలను రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చించాలని యోచిస్తోందని తెలిపారు. 

స్వామినాథన్ కమిటి సిఫారసులు, కనీస మద్దతు ధర, ఉండేలా చట్టాలు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా, పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ ఆధర్వంలో రైతు సంఘం నాయకులు జగ్జిత్ సింంగ్ దల్లేవాల్, సర్వన్ సింగ్ పందేర్ ఆధ్వర్యంలో రైతులు నిసనలు తెలుపుతూ ఢిల్లీ వైపు పాదయాతర్ చేస్తున్నారు.