కేంద్ర మంత్రుల యోగాసనాలు

కేంద్ర మంత్రుల యోగాసనాలు

దేశ వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు యోగా దినోత్సవంలో పాల్గొన్నారు. ఇటు నాగ్ పూర్ లో జరిగిన ఇంటర్నేషనల్ యోగా డేలో  కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. వేల సంఖ్యలో వచ్చిన ప్రజలతో కలిసి ఆయన యోగాసనాలు వేశారు. 

 ప్రపంచంలోనే అత్యంత పురాతన విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన   బీహార్‌లోని నలంద మహావిహారలో ఇంటర్నేషనల్ యోగా దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించారు.  ఈ ఉత్సవాల్లో కేంద్రం  విద్యుత్ శాఖ మంత్రి R K సింగ్ పాల్గొన్నారు.  700 మందితో ఆయన యోగాసనాలు వేయించారు. 

సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్  లో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు..వరుస క్రమంలో కూర్చోని యోగాసనాలు వేశారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు పాల్గొని యోగాసనాలు వేశారు. 


8వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో  కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఢిల్లీలోని తన నివాసంలో యోగాసనం వేశారు. యోగాభ్యాసం తన జీవితంలో భాగమని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు.  యోగా దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరికి మంచి ఆరోగ్యం చేకూరాలని కోరుకుంటున్నట్లు రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. 


హర్యానాలోని కురక్షేత్రలో యోగా డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కేంద్ర మంత్రి పీయూల్ గోయల్ పాల్గొని యోగాసనాలు వేశారు. 

గుజరాత్ లో జరిగిన అంతర్జాతీయ వేడుకల్లో  కేంద్ర ఆరోగ్య మంత్రి డా. మన్సుఖ్ మాండవియా పాల్గొన్నారు.  కెవాడియాలోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఆయన యోగా చేశారు. 


హిమాచల్ ప్రదేశ్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. కాంగ్రా కోట వద్ద జరిగిన ఇంటర్నేషనల్ యోగా డేలో  కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పాల్గొన్నారు. వజ్రాసనం, పద్మాసనాలు వేసి అలరించారు. 

ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ సిక్రీలోని పంచ్ మహల్ వద్ద కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ యోగా చేశారు.