మింట్ మ్యూజియాన్ని సందర్శించిన కిషన్ రెడ్డి 

 మింట్ మ్యూజియాన్ని సందర్శించిన కిషన్ రెడ్డి 

హైదరాబాద్ : సైఫాబాద్ లోని మింట్ మ్యూజియాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు. యాదాద్రి లక్ష్మీ నర్సింహ స్వామి వెండి నాణాలను ప్రారంభించారు. మింట్ మ్యూజియాన్ని దేశంలో అత్యుత్తమ మ్యూజియంగా తీర్చిదిద్దుతామన్నారు. హైదరాబాద్ లో 119 సంవత్సరాల క్రితం మింట్ మ్యూజియం ప్రారంభమైందని, స్టాంపులు, మెడల్స్, వివిధ రకాల నాణాలను ఇక్కడే ముద్రించేవారని చెప్పారు. 

నిజాం కాలం కంటే ముందు నుండి మింట్ మ్యూజియం ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. ఈ తరహా మ్యూజియం దేశంలో మరెక్కడా లేదన్నారు. హైదరాబాద్ లో ఉన్న అన్ని పాఠశాల విద్యార్థులు, టీచర్స్, ఉద్యోగులు మింట్ మ్యూజియాన్ని సందర్శించాలని పిలుపునిచ్చారు.