రిపబ్లిక్ డే వేడుకల్లో.. తెలంగాణ ఒగ్గు కళాకారుల ప్రదర్శన

రిపబ్లిక్ డే వేడుకల్లో.. తెలంగాణ ఒగ్గు కళాకారుల ప్రదర్శన

న్యూఢిల్లీ, వెలుగు: భారత సైనిక శక్తి పాటవాలతో పాటు..  అద్భుతమైన సాంస్కృతికి వైభవానికి ఢిల్లీ లోని కర్తవ్య పథ్  వేదికగా నిలిచింది. ‘వివిధ తా మే ఏక్ తా’ (భిన్నత్వంలో ఏకత్వం) నినాదంతో 2026 గణతంత్ర వేడుకల్లో ఆరంభంలో సాగిన 3 నిమిషాల కళాకారుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా మారింది. దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారుల వాయిద్యాలతో సాగిన ‘వందేమాతర’ గీతం ప్రతి ఒక్కరిని స్వాతంత్ర ఉద్యమ  కాలానికి తీసుకెళ్లింది. 

తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఉత్తరఖండ్, తమిళనాడు, ఇలా.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన మొత్తం 270 మంది కళాకారులు తమ వాయిద్యాలతో అద్భుతాన్ని సృష్టించారు. ఇందులో తెలంగాణకు చెందిన ప్రముఖ ఒగ్గుడోలు కళాకారుడు డాక్టర్ ఒగ్గు రవి  కళా బృందం సైతం తమ కళను ప్రదర్శించింది.  నాదస్వరం, సన్నాయి ఇతర వాయిద్యాలు వందేమాతరం గానాన్ని వినిపించగా ఒగ్గుడోలు దానికి ప్రాణం పోసింది. 

ఇందుకోసం దాదాపు 20 రోజులు బగ్గు రవి బృందం గడ్డకంటే చలిని సైతం ఓర్చి ప్రాక్టీస్ చేసింది. తెలంగాణ ప్రాచీన కళను బతికించింది. కాగా.. ఈ 3 నిమిషాల పాటు వాయిద్యాన్ని రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, రిపబ్లికే డే వేడులకు హాజరైన ముఖ్య అతిథి ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా మంత్రముగ్ధులై వీక్షించారు. అనంతరం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్​తో ఒగ్గు రవి బృందం సభ్యులు ఫొటోలు దిగారు.