
- జిమ్‌లు, యోగా సెంటర్లకు పర్మిషన్
న్యూఢిల్లీ: దేశంలో అన్‌లాక్ 3.0 గైడ్‌లైన్స్‌ను కేంద్రం విడుదల చేసింది. దీంట్లో భాగంగా ఆగస్టు 5 నుంచి జిమ్‌లు, యోగా సెంటర్లకు పర్మిషన్ ఇచ్చింది. నైట్ కర్ఫ్యూ ఎత్తేసింది. మెట్రో, గుంపులు గుంపులుగా తిరగడంపై ఇంకా బ్యాన్ కొనసాగుతున్నట్లు చెప్పింది. ఈ మేరకు బుధవారం ఉదయం కొత్త గైడ్‌లైన్స్ విడుదల చేసింది. లాక్‌డౌన్ ప్రారంభం నుంచి దేశంలో కొనసాగుతున్న రాత్రివేళ కర్ఫ్యూను పూర్తిగా ఎత్తేశారు. జిమ్‌లు, యోగా కేంద్రాలు ఆగస్టు 5 నుంచి తెరుకోవచ్చని చెప్పింది. భౌతిక దూరం పాటిస్తూ పంద్రాగస్టు వేడుకల కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. ఆగస్టు 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు తెరవొద్దని చెప్పింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో చర్చించి వాటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మెట్రో రైళ్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ పార్కులు, బార్లు, ఆడిటోరియాలు లాంటివి తెరవడంపై నిషేధం కొనసాగుతోంది. రాజకీయ, క్రీడా, సామాజిక, సాంస్కృతిక సభలు, సమావేశాలకు అనుమతి లేదు. కంటైన్మెంట్ జోన్లలో ఆగస్టు 31 వరకు లాక్‌డౌన్ కొనాసుగుతుందని కేంద్రం స్పష్టం చేసింది.