
అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో చేపల వేటకు పడవలో వెళ్లిన గుజరాత్, మహారాష్ట్ర జాలర్లపై పాకిస్తాన్ మారీటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీ సిబ్బంది కాల్పులు జరపడంతో ఓ మత్స్యకారుడు చనిపోయాడు. మరో వ్యక్తి గాయపడ్డాడు. గుజరాత్ తీరంలో శనివారం ఈ ఘటన జరిగింది. ఓఖా టౌన్ ప్రాంతానికి దగ్గర్లో ఇండియా బార్డర్లో వీళ్లు చేపలు పడుతుండగా పాక్ కమాండోలు ఫైరింగ్ చేయడంతో మహారాష్ట్రలోని థానేకు చెందిన శ్రీధర్ రమేశ్(32) మృతిచెందారు. గుజరాత్పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.