Unstoppable With NBK S2:తిక్క లేసింది..నాపై మర్డర్ కేసు పెట్టిన్రు: పవన్

Unstoppable With NBK S2:తిక్క లేసింది..నాపై మర్డర్ కేసు పెట్టిన్రు: పవన్

బాలయ్య అన్ స్టాపబుల్ 2 విత్ ఎన్బీకే ఓటీటీలో దుమ్మురేపుతోన్న సంగతి తెలిసిందే. సెలబ్రిటీలు, రాజకీయనాయకులు, ప్రముఖులకు బాలయ్య వేసే సూటి ప్రశ్నలు ఈ షోకే హైలెట్ అవుతున్నాయ. పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ పార్ట్ 1ఇప్పటికే టెలికాస్ట్ అయ్యి గత రికార్డులను బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.  అయితే  సెకండ్ పార్ట్ ఫిబ్రవరి 10న రాత్రి 8 గంటలకు టెలికాస్ట్ కానుంది.  ఈ ప్రోమో ఇపుడు ఆకట్టుకుంటుంది.  రెండు మిలియన్లకు పైగా వ్యూస్ తో  ట్రెండింగ్ లో కొనసాగుతోంది.

సెకండ్ పార్ట్ లో  బాలయ్య వేసే ప్రశ్నలు ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.  ఈ ఎపిసోడ్ లో బాలకృష్ణ  యు కుడ్ జాయిన్ తెలుగుదేశం అంటూ నేరుగా పవన్ కల్యాణ్ ను ప్రశ్నించారు. అలాగే పవన్ ఇటీవల కారు టాప్ పై కూర్చున్న ఫోటోపై కూడా ప్రశ్నించారు. కారులో వెళ్లకూడదు.. కారు నుంచి బయటికి రాకూడదంటే చాలా రోజుల తర్వాత నాక్కూడా తిక్క రేగింది.. అధికార యంత్రాంగం కూడా మరీ హద్దులు దాటేసిందని పవన్ బదులిచ్చారు. 


అలాగే పార్టీ ఎందుకు స్థాపించారని బాలయ్య ప్రశ్నించగా.. ఎంతసేపు మనం ప్రాథమిక హక్కులు గురించి మాట్లాడుతాం కానీ..  ప్రాథమిక బాధ్యతల గురించి మాట్లాడం..' అని పవన్ సమాధానం అన్నారు. మీ అభిమానుల ప్రేమ  ఓటు బ్యాంకుగా మారకపోవడానికి కారణమేంటని బాలయ్య అడగ్గా.. ఎవరైనా ఎదుగుతూ ఉంటే.. వారిని ఎదగనీయకుండా చేయడం వ్యూహంలో ఒక భాగం అంటూ పవన్  బదులిచ్చారు. అలాగే తనపై మర్డర్ అటెంప్ట్ కేసులు కూడా ఉన్నాయని పవన్ చెప్పారు.

ఈ షో ప్రోమోలో డైరెక్టర్ క్రిష్ కూడా సందడి చేశారు. ఇద్దరితో కలిసి సినిమాలు చేశావు కదా డిఫరెన్స్ ఏంటని క్రిష్ ను బాలయ్య ప్రశ్నించగా.. ఒక పులి, సింహం మధ్యలో తన తల ఉందంటూ సమాధానం చెప్పాడు. అలాగే పవన్ సినిమాలు మానేసి ప్రజా సేవకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని బాలయ్య అడగ్గా..ఆడియన్స్ ఎక్కువగా అవును అని సమాధానం ఇచ్చారు. అలాగే క్రిష్ కూడా అవును అని చెప్పారు. మరి  బాలయ్య వేసిన  సూటి ప్రశ్నలకు పవన్  ఎలాంటి ఆన్సర్లు చెప్పారనేది ఈ నెల 10న పూర్తి ఎపిసోడ్  టెలికాస్ట్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే..