సిద్దిపేట ,మెదక్ జిల్లాలో అకాల వర్షంతో రైతులు ఆగం 

సిద్దిపేట ,మెదక్ జిల్లాలో అకాల వర్షంతో రైతులు ఆగం 

సిద్దిపేట/మెదక్, వెలుగు: సిద్దిపేట , మెదక్ జిల్లాలో అకాల వర్షం రైతన్నలను ఆగం చేసింది. సోమవారం సాయంత్రం ఈదురుగాలులతో కురిసిన వర్షం వల్ల పలు చోట్ల చెట్లు, కరెంట్ పోల్స్ విరిగిపోగా.. ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫార్మర్లు నేలకూలాయి. సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని  శనిగరం ఐకేపీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ధాన్యం భారీగా తడిసిపోయింది. చిన్నకోడూరు మండలం సికింద్లాపూర్ గ్రామంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు విరిగి పడిపోయాయి.

 మెదక్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తూకం వేసి రైస్ మిల్లులకు తరలించేందుకు సిద్ధంగా ఉన్న ధాన్యం బస్తాలు తడిసి పోయాయి. అక్కడే మరో చోట హమాలీలు వడ్ల బస్తాలను లారీలో లోడ్ చేస్తున్న సమయంలోనే వర్షం రావడంతో తడిసి పోయాయి. ముగ్దుంపూర్ లో సైతం వడ్లు వర్షానికి తడిసిపోయాయి.