సిద్దిపేట జిల్లాలో 9368 ఎకరాల్లో పంట నష్టం

 సిద్దిపేట జిల్లాలో  9368 ఎకరాల్లో పంట నష్టం

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట జిల్లాలో అకాల వర్షంతో 9368 ఎకరాల్లో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు సోమవారం వ్యవసాయ, ఉద్యాన వన శాఖ అధికారులు ప్రాథమిక నివేదికను సిద్ధం చేశారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలోని 89 గ్రామాల్లో 3869 మంది రైతులకు సంబంధించి వరి, మామిడి, కూరగాయలు, నిమ్మ, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. 

మిరుదొడ్డి మండలంలో అత్యధికంగా 1670, నంగునూరులో  1252, కొహెడలో 1254 , అక్బర్ పేట భూంపల్లి మండలాల్లో 853 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. అక్కన్న పేట, నంగునూరు, జగదేవ్ పూర్, హుస్నాబాద్, మద్దూరు మండలాల్లో మామిడి తోటలకు నష్టం వాటిల్లింది.