MS Dhoni Birthday: ధోని జీవితంలో విషాద గాథ

MS Dhoni Birthday: ధోని జీవితంలో విషాద గాథ

భారత క్రికెట్ ప్రపంచంలో టీమిండియా మాజీ కెప్టెన్ 'మహేంద్ర సింగ్ ధోని' పేరొక ప్రత్యేక అధ్యాయం. వికెట్ కీపర్ గా, బ్యాటర్ గా, కెప్టెన్ గా ధోని సాధించిన రికార్డులను భవిష్యత్తులో ఇంకొకరు చెరిపోయొచ్చేమో కాని.. మైదానంలో తనలా వ్యూహాలు రచించే 'క్రికెట్ జీనియస్'ను తిరిగి పొందటమన్నది అసాధ్యం. ఎక్కడో రాంచీలోని ఓ మారుమూల ప్రాంతం నుంచి వచ్చి భారత క్రికెట్ తలరాతనే మార్చిన ఈ జార్ఖండ్ డైనమైట్ పుట్టినరోజు నేడు. ఈ క్రమంలో అతని జీవితంలో చోటుచేసుకున్న ఊహించని విషాదగాదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

అనుకోని ప్రమాదం

అందరిలానే ధోని యవ్వనంలో ఉన్నప్పుడు ఒక యువతిపై మనసుపడ్డారు. తన పేరు.. ప్రియాంక ఝా. ప్రాణాంకన్నా ఎక్కువుగా తనను ప్రేమించాడు. తనతో జీవితాన్ని పంచుకోవాలనుకున్నాడు. కానీ విధి అందుకు అంగీకరించలేదు. ప్రమాదం రూపంలో వారిని విడదీసింది. ఓ ప్రమాదంలో ప్రియాంక ఝా మరణించింది. అప్పుడప్పుడే భారత జట్టు వైపు అడుగులు వేస్తున్న ధోనీ.. ఆ విషాదఘటనతో కుమిలిపోయాడు. ఏడాది పాటు తనను తలుచుకోని రోజు లేదట. దాన్ని నుండి బటయపడటానికి ధోనీకి ఏడాదికి పైగా సమయం పట్టిందని చెప్తుంటారు.  

Also Read : ‘ప్రాజెక్ట్‌-కె’ లో ప్రభాస్..నాగ్ అశ్విన్ తో పనిచేయడం గర్వకారణం: అమితాబ్

అనంతరం ధోని.. తన చిన్ననాటి స్నేహితురాలైన సాక్షి సింగ్‌ను 2010లో వివాహం చేసుకున్నన్నాడు. ఈ దంపతులకు జీవా అనే కూతురుంది. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులే అయినప్పటికీ.. 2008 వరకు వీరి మధ్య సంబంధాలు లేవు. సాక్షిని స్టేడియంలో చూశాక ఆమెకు ఆకర్షితుడవుతాడు. అలా మహేంద్రుడు తన పాత జ్ఞాపకాలను మరిచిపోయి.. కొత్త జీవితాన్ని ఆరంభించాడన్నమాట. 

నేటితో 42 ఏళ్లు 

ధోని నేటితో 42 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. 1981, జూలై 7న జార్ఖండ్‌ రాజధాని రాంచీలోని ఒక మధ్యతరగతి కుటుంబంలో ధోని జన్మించారు. తండ్రి పేరు పాన్ సింగ్ ధోని. తల్లి పేరు దేవకీ దేవి. వీరికి ముగ్గురు సంతానం కాగా, ధోని అందరికంటే చిన్నవాడు. తండ్రి స్థానికంగా మెకాన్ కంపెనీలో జూనియర్ మేనేజర్‌గా పనిచేసేవారు. అందరి తల్లిదండ్రులలానే ఆయన కూడా తన పిల్లలను బాగా చదివించి, ఉన్నత స్థానంలో చూడాలని కలలు కనేవాడు. విద్యపరంగా ధోని ఆ కలను నెరవేర్చకపోయినా.. అంతకుమించిన ఆనందాన్ని తన తల్లిదండ్రులకు అందించాడనే చెప్పాలి.