సూర్యాపేట జిల్లాలో 15 ఫీట్ల గోంగూర మొక్క

సూర్యాపేట జిల్లాలో 15 ఫీట్ల గోంగూర మొక్క

గరిడేపల్లి, వెలుగు: సాధారణంగా గోంగూర మొక్కలు 6 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. అయితే సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం పాత అప్పన్నపేట గ్రామానికి చెందిన రిటైర్డ్  పీఈటీ అలుగుబెల్లి కృష్ణారెడ్డి ఇంట్లో ఉన్న గోంగూర మొక్క 15 అడుగుల ఎత్తు పెరిగింది. 

ఈ గోంగూర మొక్క గుబురుగా పెరిగి, ఆకులు పుష్కలంగా వస్తున్నాయని కృష్ణారెడ్డి భార్య సరోజనమ్మ తెలిపారు. గోంగూరను అమెరికాలో ఉంటున్న తమ కూతురుకు పంపించానని చెప్పారు. 15 ఫీట్లు పెరిగిన గోంగూర మొక్కను స్థానికులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.