Anveshippin Kandetum: OTTలో వస్తున్న మరో క్రైమ్ థ్రిల్లర్.. ఒక్కో సీన్ మైండ్ బ్లాక్ అంతే!

Anveshippin Kandetum: OTTలో వస్తున్న మరో క్రైమ్ థ్రిల్లర్.. ఒక్కో సీన్ మైండ్ బ్లాక్ అంతే!

ఈమధ్య ఓటీటీలలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు బాగా వస్తున్నాయి. ఆడియన్స్ కి కూడా నార్మల్ సినిమా చూసి చూసి బోర్ కొట్టేసినట్టుంది. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను చూడటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అలాంటి సినిమాలకే వ్యూస్ ఎక్కువగా వస్తున్నాయి. ఇక థ్రిల్లర్ సినిమాలకు మలయాళ ఇండస్ట్రీ చాలా ఫేమస్. అక్కడ వారానికో థ్రిల్లర్ సినిమా రిలీజ్ అవుతూనే ఉంటుంది. వాటిని ఓటీటీలో డబ్ చేసి రిలీజ్ చేసి క్యాష్ చేసుకుంటున్నారు మేకర్స్. అలా మళయాళ ఇండస్ట్రీ నుండి మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. 

మలయాళ సూపర్ స్టార్ టోవినో థామస్ నటించిన లేటెస్ట్ మూవీ అన్వేషిప్పిన్ కండేతుమ్. పోలీస్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్డ్రాప్ లో థ్రిల్లింగ్ కథాంశంతో వచ్చిన ఈ సినిమా ఫిబ్రవరి 9న థియేటర్స్ లోకి వచ్చి మంచి విజయం సాధించింది. నిజజీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కు ఆడియన్స్ ఫుల్లుగా కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు ఆ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులోకి రానుంది. శివరాత్రి కానుకగా మార్చ్ 8నుండి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఆనంద్ నారాయణన్ (టొవినో థామస్) సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. అతనికి లవ్‌లీ అనే అమ్మాయి మిస్సింగ్ కేసు వస్తుంది. ఈ కేసుని దర్యాప్తు చేస్తున్న సమయంలో ఓ ప్రమాదం జరుగుతుంది. దాంతో.. ఆనంద్ ని డ్యూటీ నుండి సస్పెండ్ చేస్తారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఓ అమ్మాయి పరువు హత్య కేసు మళ్ళీ ఆనంద్ దగ్గరికి వస్తుంది. ఈ రెండు కేసులకు ఉన్న లింక్ ఏంటి? ఆ కేసుల్ని ఎస్ఐ ఆనంద్ ఎలా సాల్వ్ చేశాడు? చివరకు ఏమైంది? అనేది మిగిలిన కథ.