మహిళా భద్రతపై యూపీ సీఎం యోగీ రివ్యూ

మహిళా భద్రతపై యూపీ సీఎం యోగీ రివ్యూ

ఉత్తర్ ప్రదేశ్ లో మహిళలపై అఘాయిత్యాలు, దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్. రాష్ట్ర హోంశాఖ మంత్రి, హోంశాఖ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు.

మహిళలు, ఆడపిల్లలపై ఇటీవల జరిగిన దారుణాలు దేశమంతటా చర్చనీయాంశం అవుతున్నాయి. అలీగఢ్ లోని తప్పాల్ లో రెండున్నరేళ్ల చిన్నారిని రేప్ చేసి చంపేసిన సంఘటన, తర్వాత పరిణామాలపై సీఎం యోగీ ఆరా తీశారు. పరిస్థితిని ఎట్టిపరిస్థితుల్లోనూ కంట్రోల్ చేయాలని… బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు సూచించారు.