మహిళల భద్రత మా బాధ్యత

మహిళల భద్రత మా బాధ్యత

యూపీలో రేపు తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అక్కడ అన్ని రాజకీయ పార్టీలో హోరాహోరిగా ప్రచారాలు నిర్వహిస్తున్నారు. వ్యూహ ప్రతివ్యూహాలతో ఎన్నికల్లో గెలుపు కోసం పార్టీలు ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్... మొరాదాబాద్‌లోని బిలారీలో వర్చువల్ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రసంగిస్తూ.. ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అరాచకాలు సృష్టిస్తున్న వ్యక్తులపై గత 5 ఏళ్లలో కఠినంగా వ్యవహరిస్తున్నారన్నారు. ‘యే ఫిర్ సే గార్మీ దిఖ్ రహే హై. మార్చి 10 కే బాద్ ఫిర్ సే బీజేపీ సర్కార్ ఆనే దీజీయే, ఇంకీ గర్మీ కో శాంత్ కరణే కా కరీ సర్కార్ కరేగి’ అంటూ యోగి మాట్లాడారు.

రాష్ట్రంలో మళ్లీ వేడి రాజుకుంటుందని..మార్చి 10 తర్వాత మరోసారి బీజేపీ సర్కార్ వస్తుందని అప్పుడు వీళ్ల వేడిని ఎలా తగ్గించాలోప్రభుత్వానికి తెలుసనని యోగి ఈ సందర్భంగా మాట్లాడారు. మహిళలు తమ భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీఎం యోగి. అది తమ కర్తవ్యమన్నారు. ఉపాధి కోసం యువత ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు సీఎం. అది కూడా తమ బాధ్యతే అన్నారు. ఈ సంవత్సరం యువతకు 1 కోటి టాబ్లెట్‌లు స్మార్ట్‌ఫోన్‌లను అందించబోతున్నామని తెలిపారు.

ఇవి కూడా చదవండి: 

మాకు అధికారమిస్తే ఆవు పేడ కొంటం

చిరు, జగన్ భేటీపై తమ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు