చిరు, జగన్ భేటీపై తమ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు

చిరు, జగన్ భేటీపై తమ్మారెడ్డి కీలక వ్యాఖ్యలు

ఏపీ సీఎం జగన్, మెగాస్టార్ చిరంజీవి మరోసారి భేటీ అవుతున్నవిషయం తెలిసిందే.ఈ విషయమై ప్రముఖ టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం  పిలవలేదు ఎందుకు అడుక్కొని వెళ్ళడం అన్నారు భరద్వాజ. చిరంజీవిని ఏపి గవర్నమెంట్ గుర్తించింది సంతోషమన్నారు. చిరంజీవి కూడా మా నాయకుడే అన్నారు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులను కచ్చితంగా పిలవాలి పిలిచిన తరువాతే నిర్ణయాలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఏపీ సీఎం జగన్‌కు విన్నవించారు. టిక్కెట్ రెట్లు ఎక్కువ రేట్లకు అమ్మి దానికి టాక్స్ లు కట్టలేదన్నారు. ఇప్పుడు ఏపి ప్రభుత్వం  తగ్గించడం వలన కలెక్షన్స్ రావడం లేదన్నారు. ఇపుడు రెట్లు పెంచితే టాక్స్ కడతామని ప్రభుత్వంతో చెప్పారన్నారు. టాక్స్ కట్టకపోవడం నేరమన్నారు. మనం కరెక్ట్ గా ఉందామన్నారు. 

అన్ లైన్ బుకింగ్ తీసుకొస్తాం అని రెండు ప్రభుత్వాలు చెప్పయన్నారు. అన్ లైన్ బుకింగ్ వస్తె అడ్డగోలుగా దోపిడీ పోతుందన్నారు. అన్ లైన్ బుకింగ్ గవర్నమెంట్ తో కాకుండా FDC తో కలిపి వుండాలన్నారు. Ufo qubeలతో సమస్య వుందన్నారు. టిక్కెట్ రెట్లు ..తెలంగాణ లో పెంచారన్నారు. బంగార్రాజు సినిమా తెలంగాణాలో తక్కువ చేసిందన్నారు. అఖండ పుష్ప ఆంధ్రలో బాగా చేశాయన్నారు. అయితే ఇక్కడ టిక్కెట్ రేటు పెంచడం వలన కూడా డబ్బు ఎక్కువ రాదన్నారు. మనం మాట్లాడేది డైరెక్ట్ గా మాట్లాడితే బాగుంటుందన్నారు. 5వ షో పెట్టుకోవచ్చు 4షోలు పెద్దవి వేసినా 5వ షో చిన్న సినిమాలకు ఇవ్వాలన్నారు. నంది అవార్డులను రెండు ప్రభుత్వాలు ఇవ్వాలన్నారు. ఆంధ్రలో లొకేషన్ చార్జీలు తీసేశారు పర్మిషన్స్ కూడా వెంటనే ఇస్తున్నారు..తెలంగాణలో కూడా లొకేషన్ చార్జీలు తీసెయ్యాలి
 
మినీ థియేటర్స్ ను ఎంకరేజ్ చెయ్యాలన్నారు. ఆంధ్రలో రెండు మూడు చోట్ల మినీ థియేటర్స్ ఉన్నాయని వాటిని పెంచాలన్నారు. తెలంగాణలో మినీ థియేటర్స్‌ పెడతామన్నారు. సినీ వర్కర్స్ కి బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు. పవర్ చార్జెస్ విషయంలో... థియేటర్స్ కి కమర్షియల్ చార్జీలు తీసుకుంటున్నారన్నారు. అలా కాకుండా నార్మల్ ఛార్జెస్ తీసుకోవాలన్నారు. కరోనా టైం లో ఎడు ఎనిమిది నెలలు థియేటర్స్ మూసి వుంచారన్నారు. వాటి చార్జీలు నామినల్ గా తీసుకోవాలన్నారు. రెమ్యునరేషన్ లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదన్నారు. కానీ లగ్జరీ స్ నీ కొంత అవాయిడ్ చేయాలి అని టెక్నిషియన్స్ , యాక్టర్స్‌ను ఆయన ఈ సందర్భంగా కోరారు. 

ఇవి కూడా చదవండి: 

మీరు చేసిన తప్పుకు రైతులను దొంగల్ని చేశారు

తక్కువ స్కోరుకే మూడు వికెట్లు కోల్పోయిన భారత్