
లక్నో : ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ .. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ ను ఆయన ఇంట్లో కలిశారు. లక్నోలో ఈ సాయంత్రం ములాయం ఇంటికి వెళ్లిన సీఎం.. ఆయన్ను పరామర్శించారు. ఈ భేటీలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, శివపాల్ సింగ్ యాదవ్ కూడా పాల్గొన్నారు.
ములాయం సింగ్ యాదవ్ ఆదివారం అనారోగ్యంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడంతో.. ఆయన్ను హాస్పిటల్ లో చేర్పించారు. ఈ ఉదయం ములాయంను డిశ్చార్జ్ చేశారు. హాస్పిటల్ నుంచి ఇంటికి తిరిగొచ్చిన ములాయంను.. మర్యాదపూర్వకంగా కలిసి పరామర్శించారు సీఎం యోగీ.