రాహుల్‌‌ కుట్టిన చెప్పులకు రూ.10 లక్షల ఆఫర్

రాహుల్‌‌  కుట్టిన చెప్పులకు రూ.10 లక్షల ఆఫర్
  • అమ్మేది లేదని తేల్చి చెప్పిన చెప్పులు కుట్టే వ్యక్తి రామ్ చెట్‌‌ 

సుల్తానాపూర్‌‌ (యూపీ): కాంగ్రెస్‌‌ అగ్రనేత, ఎంపీ రాహుల్​ గాంధీ కుట్టిన చెప్పులకు ఎన్ని లక్షలు ఇచ్చినా.. అమ్మేది లేదని సుల్తాన్​పూర్​లో చెప్పులు కుట్టే వ్యక్తి రామ్‌‌  చెట్‌‌  తేల్చి చెప్పారు. ఇటీవల ఓ కేసు విషయంలో ఉత్తరప్రదేవ్​లోని సుల్తాన్​పూర్‌‌ కోర్టుకు హాజరైన రాహుల్‌‌.. అక్కడే ఉన్న ఓ చెప్పుల దుకాణానికి వెళ్లి స్లిప్పర్స్​ను కుట్టాడు. ఇప్పుడు ఈ స్లిప్పర్స్‌‌ కు ఫుల్‌‌ డిమాండ్‌‌ ఏర్పడింది. రాహుల్‌‌  గాంధీ రామ్‌‌  చెట్​ను కలిసి వెళ్లిన తర్వాత ఉత్తరప్రదేశ్​ ప్రభుత్వంలో పలు శాఖల అధికారులు వచ్చి, ఆయన సమస్యలు తెలుసుకుంటున్నారు.

రోజూ ఎవరో ఒకరు రామ్‌‌ చెటఖను కలిసి వెళ్తుండటంతో ఆయన సుల్తాన్‌‌ పూర్​లోని విధాయక్​నగర్​లో సెలబ్రిటీ అయ్యాడు. కాగా, డిఫమేషన్‌‌  కేసులో జులై 26న సుల్తాన్‌‌ పూర్‌‌ కోర్టు కేసు విచారణ అనంతరం రాహుల్‌‌  గాంధీ రామ్‌‌  చెట్‌‌  చెప్పుల దుకాణం వద్ద ఆగాడు. షాప్​లో కొద్దిసేపు కూర్చొని రామ్‌‌  కష్టాలు తెలుసుకున్నాడు. తర్వాత షాప్‌‌ లో ఉన్న స్లిప్పర్స్‌‌  తీసుకొని కుట్టాడు. దీనిపై రామ్‌‌ చెట్‌‌  స్పందిస్తూ.. ‘‘రాహుల్‌‌  గాంధీ నా దుకాణానికి వచ్చి వెళ్లినప్పటి నుంచి ఉతర్తప్రదేశ్​ ప్రభుత్వ అధికారులు వచ్చి నా సమస్యలు తెలుసుకుంటున్నారు.

అంతేకాకుండా రాహుల్‌‌ కుట్టిన చెప్పులను మేము కొంటామంటూ ప్రతి రోజూ నాకు చాలా ఫోన్ కాల్స్‌‌ వస్తున్నాయి. మంగళవారం ఒక వ్యక్తి ఫోన్‌‌  చేసి రూ.5 లక్షలు ఇస్తాం.. చెప్పులు ఇవ్వాలని అడిగాడు. నేను కుదరదని చెప్పాను. అప్పుడు అతను రూ.10 లక్షలు ఇస్తానన్నాడు. నేను ఇవ్వను అని చెప్పాను. ఈ చెప్పులు నాకు లక్కీ అని ఆయనతో చెప్పాను. వీటికి గాజు ఫ్రేమ్‌‌  కట్టించి. నా షాప్‌‌ లో పెట్టుకుంటాను”అని చెప్పాడు. రాహుల్‌‌  గాంధీ నా దుకాణంలో కూర్చొని చెప్పు కుట్టడం ద్వారా ఆయన తన పార్ట్‌‌ నర్‌‌ ‌‌  అయ్యారని రామ్‌‌  అన్నారు.