
మీరట్ : మీరట్ కు చెందిన స్కూల్ టీచర్ దీప్తి శర్మ దంపతులకు కొండప్రాంతాలంటేఇష్టం . ఎక్కువగా మౌంటనీరింగ్ కు వెళ్లే ఆ జంట అక్కడ టూరిస్టులు వదిలేస్తున్న ప్లాస్టి క్‌బాటిల్స్‌ను చూసి వాటితో ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. బాటిల్స్‌తో ఇల్లుకట్టుకోవాలనే ఐడియా వచ్చింది. 2017లో ఉత్తరాఖండ్ లోని హర్టోలా గ్రామంలో స్థలంకొనుక్కున్న ఆ జంట రూ.1.5లక్షలతో ప్లాస్టి క్ బాటిళ్లను కొని, వాటిని ఉపయోగించి ఇల్లుకట్టుకుంది. 26వేల ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించి నాలుగు రూములను కట్టారు. టైర్లతోఇంటికి ఫ్లోరింగ్ , మెట్లను ఏర్పాటు చేశారు. పదివేల లీటర్ల కెపాసిటీ నీటి ట్యాంక్ ను కూడా నిర్మిస్తున్నామని, పూర్తైన వెంటనే ఆ ఇంట్లోనే ఉంటామని వాళ్లు చెప్పారు. దీని గురించి అధికారులకు వివరించి ఇళ్లు, షాపులు, పబ్లిక్ టాయిలెట్స్‌ను ప్లాస్టిక్ బాటిళ్లతో నిర్మించేలా చూస్తామని దీప్తి చెప్పారు.