
లక్నో: పాన్ మసాలా తయారీ, అమ్మకాలకు యూపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనా ఎఫెక్టుతో నిషేధం విధించిన యూపీ ప్రభుత్వం రాష్ట్రంలో పాన్ మసాలా అమ్మకాలపై బ్యాన్ ఎత్తివేస్తున్నట్లు గురువారం నోటీసు జారీ చేసింది. అయితే, గుట్కా, ఖైమా వంటి పొగాకు, నికోటిన్ ఉత్పత్తులు, స్టోరేజీ, అమ్మకాలపై బ్యాన్ కొనసాగుతుందని పేర్కొంది. ఈ ఉత్తర్వులు హోం శాఖ మార్గదర్శకాల మేరకు ఈరోజు నుంచే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. మార్చి 25 న విధించిన ‘పాన్ మసాలా’ తయారీ, అమ్మకంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసినట్లు అక్కడి ఫుడ్ సెక్యూరిటీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అనితా సింగ్ జారీ చేసిన ఉత్తర్వులో తెలిపారు.