శరవేగంగా గంగా ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులు 

శరవేగంగా గంగా ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులు 

యూపీలో గంగా ఎక్స్ ప్రెస్ వే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఇప్పటికే 56 శాతానికిపైగా పనులను పూర్తి చేసింది. త్వరలో మిగతా పనులు  కూడా కంప్లీట్ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో అతి పొడవైన 594 కిలోమీటర్ల  మీరట్ --ప్రయాగ్‌రాజ్ గంగా ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి ఈనెల 13న పర్యావరణ అనుమతులు వచ్చాయి. దీని కోసం దాదాపు 6,966 హెక్టార్ల  భూమిని కొనుగోలు చేశారు. ప్రయాగ్‌రాజ్‌ను మీరట్‌తో అనుసంధానించే ఈ ఎక్స్‌ప్రెస్‌వే రాష్ట్రంలోని దాదాపు 518 గ్రామాలను కవర్ చేస్తుంది. 

 ఈ ఎక్స్‌ప్రెస్‌వే మీరట్, హాపూర్, బులంద్‌షహర్, అమ్రోహా, సంభాల్, బదౌన్, షాజహాన్‌పూర్, హర్దోయ్, ఉన్నావ్, రాయ్ బరేలీ, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్ జిల్లాలను కలుపుతుంది. గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై అత్యవసర పరిస్థితుల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్‌లను ల్యాండింగ్ ..టేకాఫ్ చేయడానికి షాజహాన్‌పూర్ వద్ద 3.5 కి.మీ పొడవైన రన్‌వే కూడా అభివృద్ధి చేస్తున్నామని  ప్రభుత్వం తెలిపింది. ఈ ఎక్స్‌ప్రెస్‌వేకి ఇరువైపులా  ప్రత్యేక పారిశ్రామిక పార్కులను నిర్మించడానికి అర్బన్ ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీకి ప్రభుత్వం అధికారం ఇచ్చింది.