
హైదరాబాద్, వెలుగు: ఇన్పుట్ట్యాక్స్క్రెడిట్ను మోసపూరితంగా ఉపయోగించుకుంటూ జీఎస్టీ ఎగవేతకు పాల్పడ్డ యూపీ వ్యాపారి కౌశిక్ శక్తి బాబూరామ్‌ను కమర్షియల్ట్యాక్స్అధికారులు అరెస్టు చేశారు. ఉత్తర ప్రదేశ్కు చెందిన బాబూరామ్కు దేశవ్యాప్తంగా 21 సంస్థలు ఉండగా.. రాష్ట్రంలో 4 సంస్థలను నడిపిస్తున్నాడు. అన్ని సంస్థల్లోనూ పన్ను చెల్లింపులకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డాడని అధికారులు చెప్పారు. వస్తువుల సరఫరాపై పన్నుతో పాటు రూ.20.08 కోట్ల జీఎస్టీ ఎగ్గొట్టడంతో బాబూరామ్‌ను అదుపులోకి తీసుకుని, రిమాండ్కు పంపించినట్లు తెలిపారు. ఈ మోసాల వెనక సూత్రధారి ఎవరన్నది తెలుసుకునేందుకు బాబూరామ్ ను ప్రశ్నిస్తున్నట్లు కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ అనిల్ కుమార్ చెప్పారు. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.