భార్య తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్య తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. భార్య మీద అనుమానంతో ఆమె తల నరికి చంపాడో భర్త. బండా ప్రాంతంలో చిన్నార్ యాదవ్, అతని భార్య విమ్లా నివసించేవారు. వారి మధ్య చిన్న చిన్న గొడవలు జరుగుతుండేవి. అలానే శుక్రవారం ఉదయం 7:30 గంటల సమయంలో కూడా గొడవ జరిగింది. ఈ గొడవలో సహనం కోల్పోయిన చిన్నార్ యాదవ్.. పదునైన ఆయుధంతో విమ్లాపై దాడిచేసి.. ఆమె తల నరికి చంపాడు. భార్య తలను తీసుకొని చిన్నార్ యాదవ్.. స్థానికంగా ఉన్న బాబేరు పోలీస్ స్టేషన్‌కి తీసుకొని వెళ్లాడు. అలా చేతిలో తలపట్టుకొని రోడ్డుపై వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. భార్య తలతో పోలీస్ స్టేషన్‌కి వచ్చిన చిన్నార్ యాదవ్‌ని అరెస్ట్ చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ మహేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. యాదవ్‌ని అదుపులోకి తీసుకున్నారు. విమ్లా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.

For More News..

అన్‌లాక్ తర్వాత రెస్టారెంట్లపై జోమాటో సర్వే

గూగుల్‌‌‌‌‌‌‌‌లో తెగ వెతుకుతున్న ఈ డైట్ మంచిదేనా?

తెలంగాణలో కొత్తగా 1,891 కరోనా కేసులు