ఉద్యోగినిపై లైంగిక వేధింపులు.. వీడియో వైరల్ కావడంతో అధికారి అరెస్ట్

ఉద్యోగినిపై లైంగిక వేధింపులు.. వీడియో వైరల్ కావడంతో అధికారి అరెస్ట్

లక్నో: మహిళా ఉద్యోగిని లైంగికంగా వేధించినందుకు ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ ప్రభుత్వ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు. యూపీ మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్‌లో ఒక 30 ఏళ్ల మహిళ 2018 నుంచి కంప్యూటర్ ఆపరేటర్‌‌గా పని చేస్తోంది. అదే ఆఫీసులో సెక్షన్ ఇన్‌చార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న ఇచ్చా రామ్ యాదవ్ అనే ఆఫీసర్.. 2018 నుంచి ఆ మహిళను వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని బయటపెడితే ఉద్యోగం నుంచి తొలగిస్తానని ఆమెను పలుమార్లు బెదిరించాడు. దీంతో రామ్ యాదవ్‌పై బాధితురాలు పో లీసులకు ఫిర్యాదు చేసింది. కానీ వారం రోజులు గడిచినా పోలీసులు అతడ్ని అరెస్ట్ చేయలేదు. అయితే బాధితురాలిని రామ్ యాదవ్ వేధిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో ట్విట్టర్ లాంటి సోషల్ మీడియాలో ప్లాట్‌ఫామ్స్‌లో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మహిళ ఫిర్యాదు చేసినా యూపీ పోలీసులు నిందితుడ్ని ఆలస్యంగా అరెస్ట్ చేయడంపై నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.  

మరిన్ని వార్తల కోసం: 

కోహ్లి కూతురికి రేప్ బెదిరింపులు.. నిందితుడి అరెస్ట్ 

‘పద్మ’ అవార్డు తీసుకొని.. సీఎం ఇంటి ముందు రెజ్లర్ నిరసన

నేరం ఒప్పుకోలేదని యువకుడ్ని చితకబాదిన పోలీసులు